సుధీర్‌బాబు ప్రొడక్షన్స్
నన్ను దోచుకుందువటే
తారాగణం: సుధీర్‌బాబు, నభా నటేష్, నాజర్, సుదర్శన్, వైవా హర్ష, తులసి, జీవా, వేణు తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాత: సుధీర్‌బాబు
రచన, దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు
విడుదల తేదీ: 21.09.2018
సమ్మోహనం వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత హీరో సుధీర్‌బాబు చేసిన మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నన్ను దోచుకుందువటే. ఈ చిత్రంతో సుధీర్ నిర్మాతగా కూడా మారారు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సుధీర్‌బాబుకి మరో సూపర్‌హిట్‌ని అందించిందా? నిర్మాతగా చేసిన తొలి సినిమా అతనికి ఎలాంటి పేరుని తెచ్చింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
అతని పేరు కార్తీక్(సుధీర్‌బాబు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. పని తప్ప మరో ధ్యాసలేని కార్తీక్‌కి అమెరికా వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలన్నదే లక్ష్యం. అయితే కార్తీక్ పెళ్ళి అతని మరదలితో చెయ్యాలని కుటుంబ సభ్యులు అనుకుంటారు. పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేని కార్తీక్ రెండు రోజులపాటు అతని లవర్‌గా నటించడానికి ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ మేఘన(నభా నటేష్)ను సెలెక్ట్ చేసుకుంటాడు. అలా పరిచయమైన మేఘన... కార్తీక్‌కి, అతని కుటుంబ సభ్యులకు బాగా దగ్గరవుతుంది. మేఘన... కార్తీక్ లవర్‌గా నటించేందుకు వచ్చిందని తెలియని అతని తండ్రి.. మేఘన తన కోడలు అని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత కార్తీక్‌లోని గుడ్ క్వాలిటీస్ చూసిన మేఘన నిజంగానే అతని ప్రేమలో పడుతుంది. కొన్ని సంఘటనల తర్వాత కార్తీక్ కూడా మేఘనను ప్రేమించడం మొదలుపెడతాడు. అయితే ఆ ప్రేమను ఇద్దరూ మనసులోనే దాచుకుంటారు తప్ప బయటికి చెప్పుకోరు. మరి వీరి ప్రేమ సఫలమైందా? ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారా? అనేది మిగతా కథ.
కార్తీక్ క్యారెక్టర్‌లో సుధీర్‌బాబు పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి నటించాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ సీన్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ పరిచయమైన నభా నటేష్ పెర్‌ఫార్మెన్స్ సూపర్ అని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో తన నటనతో అందర్నీ అలరించింది. కార్తీక్ తండ్రిగా నాజర్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ తల్లిగా నటించిన తులసి కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. అయినా ఫర్వాలేదు అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్లు చేసిన నటీనటులు తమ పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే సురేష్ రగుతు ఫోటోగ్రఫీ బాగుంది. అందమైన వైజాగ్ లొకేషన్లను మరింత అందంగా చూపించడంలో సురేష్ సక్సెస్ అయ్యాడు. అజనీష్ లోకనాథ్ అందించిన పాటలు బాగున్నాయి. సినిమా మూడ్‌ని బట్టి మంచి బ్యాక్‌గ్రౌండ్ చేశాడు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ సెకండఫ్‌లోని లెంగ్త్‌ని తగ్గించి సినిమాను స్పీడ్ చెయ్యడంలో సక్సెస్ అవ్వలేకపోయాడు. సుధీర్‌బాబు తొలిసారి నిర్మించిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు గురించి చెప్పాలంటే తనకు తొలి సినిమా అయినప్పటికీ ప్రతి సీన్‌ను అందంగా తీసే ప్రయత్నం చేశాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నాడు. కథగా చెప్పుకుంటే ఇది చాలా పాత కథ. దానికి కొన్ని కొత్త రంగులు అద్ది సినిమా బాగా వచ్చేందుకు తోడ్పడ్డాడు. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌ని ఎంతో సరదాగా నడిపించాడు. హీరోయిన్ కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయించింది. దానికి తగ్గట్టుగానే మంచి డైలాగ్స్‌ని రాసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్‌లో ఒక క్యారెక్టర్ చెయ్యడానికి రెడీ అయిన సుధీర్‌తో మంచి కామెడీ చేయించాడు. రొమాటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నన్నుదోచుకుందువటే చిత్రాన్ని తీర్చిదిద్దాడు నాయుడు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపించాడు. సెకండాఫ్‌కి వచ్చే సరికి కొంత సెంటిమెంట్‌ని పండించే ప్రయత్నం చేశాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే తండ్రీకొడుకుల సీన్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం ఆకట్టుకోవాలని నాయుడు చేసిన ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. దాన్ని తీసిన విధానం ఇంప్రెసివ్‌గా లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్‌హాఫ్ కామెడీతో సరదాగా నడిచిన సినిమా, సెకండాఫ్‌కి వచ్చేసరికి కామెడీ ప్లేస్‌లో సీరియస్‌నెస్ వచ్చి చేరింది. అయితే సెకండాఫ్‌లో తాను అనుకున్న దాన్ని క్లారిటీగా చెప్పలేకపోయాడు నాయుడు. ఓవరాల్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఏవరేజ్ మూవీగా నిలుస్తుంది.
ఫినిషింగ్ టచ్: ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2NXnzKY
0 Comments