‘కలర్ ఫొటో’ చిత్ర ఆల్బమ్ నుంచి ఆగస్ట్ 27న రానున్న మొదటి పాట తరగతి గది
అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమృత ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు కలర్ ఫొటో చిత్రానికి కథ కూడా అందించడం విశేషం. ఇటీవలే కలర్ ఫొటో టీమ్ విడుదల చేసిన టీజర్‌కు ఆన్ లైన్ తో పాటు వివిధ వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ మూవీ టీజర్‌కు యూట్యూబ్‌లో దాదాపుగా 3 మిలియన్లుకు పైగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివిధ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్‌తో ట్రెండ్ అవుతున్నట్లుగా కలర్ ఫొటో యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలర్ ఫొటో మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తరగతి గదిలో అంటూ మొదలైయ్యే ఈ పాటను ఆగస్ట్ 27న ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోషల్ మీడియం ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లుగా మంగళవారం జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘‘కమెడియన్‌గా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటాను. నామీద ఎంతో నమ్మకంతో నిర్మాతలు సాయిరాజేశ్ గారు, బెన్నీ గారు హీరోగా నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. దాంతో పాటే సాయి రాజేశ్‌గారు ఈ సినిమాకి స్టోరీని కూడా అందిస్తున్నారు. ఇక డైరెక్టర్ సందీప్‌తో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఈ సినిమా తరువాత సందీప్ ఇంకా మంచి స్థాయికి వెళ్లాలి అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓ అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథతో మా కలర్ ఫొటో రెడీ అయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో ఈ చిత్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కేలా చేశారు. యాక్టర్ సునీల్ గారితో, మన తెలుగమ్మాయి చాందినీ చౌదరితో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందగా అనిపించింది. ఆగస్ట్ 27న ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మా సినిమా పాటల ఆల్బమ్ నుంచి మొదటి పాట తరగతి గదిని విడుదల చేస్తున్నాము’’ అని అన్నారు.
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘యూట్యూబ్‌లో నేను పోస్ట్ చేసిన వీడియోలను లైక్ చేస్తూ, పాజిటివ్ కామెంట్స్ పెడుతూ నన్ను ఎంకరేజ్ చేసిన ఆడియెన్స్ ఇప్పుడు డైరెక్టర్‌గా నేను తీసిన తొలి సినిమా కలర్ ఫొటోను కూడా ఆదిరిస్తారని ఆశిస్తున్నాను. డైరెక్టర్‌గా నా తొలి సినిమా అయినప్పటికీ నా స్నేహితుడు సుహాస్ హీరో కావడంతో నేను ఎలాంటి బెదురు, టెన్షన్ లేకుండా సినిమా తెరకెక్కించాను. అలానే సినిమా నిర్మాతలు సాయిరాజేశ్, బెన్నీ ముప్పానేని షూటింగ్ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా కథను నిర్మాత సాయి రాజేశ్‌గారు అద్భుతంగా, చాలా ఎమోషనల్‌గా రెడీ చేశారు. స్టోరీలో ఉన్న మెయిన్ సోల్ ఎక్కడా మిస్ కాకుండా ఆడియెన్స్ ఆకట్టుకునే రీతిన ఈ సినిమా ఆద్యంతం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మంచి ట్యూన్ ఇచ్చారు. ఆగస్ట్ 27న మా సినిమా ఆల్బమ్ నుంచి తరగతి గది అంటూ సాగిపోయే పాట ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుదల అవ్వబోతుంది..’’ అని అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘‘కలర్ ఫొటో టీజర్‌కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ విన్న వెంటనే ఇందులో లేడీ క్యారెక్టర్స్ అన్నిటికి చాలా మంచి పేరు లభిస్తుందని అనిపించింది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత సాయిరాజేశ్, బెన్నీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. దర్శకుడు సందీప్, ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మనఃస్పూర్తిగా నమ్ముతున్నాను’’ అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారి అభిమానిగా సినిమాల్లోకి వచ్చాను. నన్ను కలర్ ఫొటో సినిమాలో భాగస్వామిగా చేర్చుకున్న నిర్మాత సాయిరాజేశ్ గారికి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను..’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి, దర్శకుడు సందీప్, లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్, కెమెరామేన్ వెంకట్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
సహ నిర్మాత: మణికంఠ
లైన్ ప్రొడ్యూసర్: గంగాధర్
పీఆర్ఓ: ఏలూరు శ్రీను
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/34xQgG9
0 Comments