భీష్మ

హీరో నితిన్ గత కొద్దికాలంగా హిట్టుకు దూరమైపోయారు. ‘అ ఆ’ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఏడాదిన్నర విరామం తీసుకుని ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో కూడిన ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌తో వచ్చారు నితిన్. ఆ సినిమానే ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. ‘ఛలో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. ఫుల్ లెగ్త్ కామెడీ, యూత్ కోసం లవ్ స్టోరీ, దానిలో భాగంగా ఒక చిన్న మెసేజ్‌తో ఈ సినిమాను రూపొందించారు. ‘దిల్’, ‘సై’ తరవాత మళ్లీ ఆ స్థాయి ఎంటర్‌టైన్మెంట్‌తో వస్తోన్న సినిమా ఇదని ఇప్పటికే నితిన్ చెప్పారు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్‌లో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సేంద్రియ వ్యవసాయం అనే అంశాన్ని కూడా కథలో భాగం చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. మొత్తానికి భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. యూఎస్ ప్రీమియర్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. సినిమా చాలా బాగుందని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. కథ అంత గొప్పగా లేకపోయినా దర్శకుడు వెంకీ కుడుముల సినిమాను నడిపించిన తీరు, కామెడీ, ట్విస్టులు చాలా బాగున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా నితిన్ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారట. కామెడీ టైమింగ్, డైలాగులు ఇరగదీశారట. ఇక రష్మిక, నితిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటున్నారు. వెన్నెల కిషోర్, రఘుబాబు కామెడీ సినిమాకు మరో ప్లస్ అని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గమనిక: పైన పేర్కొన్న రేటింగ్ ప్రస్తుతం సినిమాకు ఉన్న హైప్, టాక్, మార్కెట్ ఆధారంగా ఇచ్చాం. ‘సమయం’ పూర్తి రివ్యూ వచ్చిన తరవాత రేటింగ్ మారే అవకాశం ఉంది.


from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT

Post a Comment

0 Comments