వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లెలతో విజయ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేశారు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించే చిత్రమిది. నాలుగు ప్రేమకథల చుట్టూ తిరిగే సినిమా ఇది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్‌తోనే హైప్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ.. ట్రైలర్‌తో అందరినీ ఆకర్షించారు. సినిమాలో ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. Also Read: వాలంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ తన నటనతో అబ్బురపరిచారట. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారని అంటున్నారు. అయితే, డైరెక్టర్ క్రాంతి మాధవ్ తీసుకున్న ఈ కొత్త కాన్సెప్ట్‌ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరనే వాదన వినిపిస్తోంది. కాబట్టి, తొలిరోజు గడిస్తే గానీ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఏంటో పూర్తిగా చెప్పలేం. గమనిక: పైన పేర్కొన్న రేటింగ్ ప్రస్తుతం సినిమాకు ఉన్న బజ్, హైప్, బిజినెస్ ఆధారంగా ఇచ్చాం. ‘సమయం’ పూర్తి రివ్యూ వచ్చిన తరవాత ఈ రేటింగ్ మారే అవకాశం ఉంది.


from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT

Post a Comment

0 Comments