జాను

తెలుగులో ఇప్పటి వరకు ప్రేమకథలు చాలానే వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ఫీల్ గుడ్ మూవీస్‌గా నిలిచిపోయాయి. అయితే, ఫీల్ గుడ్ మూవీస్ అనిపించుకున్న ప్రతి సినిమాకు కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. ఉదాహరణగా రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ను చెప్పుకోవచ్చు. తమిళ్ సినిమా ‘ఆటోగ్రాఫ్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్. కాకపోతే అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇదిలా ఉంటే, తమిళంలో సూపర్ హిట్ అయిన మరో ఫీల్ గుడ్, క్లాసిక్ మూవీ ‘96’. ఈ సినిమాను తెలుగులో ‘జాను’గా రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. ‘96’ సినిమాలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుందని ఇప్పటికే సినిమా చూసినవాళ్లు చెబుతుంటారు. అదే మ్యాజిక్‌ను ‘జాను’లో కూడా రీక్రియేట్ చేసినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే చెప్పింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్లు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోనూ మార్నింగ్ షోలు స్టార్ట్ అయ్యాయి. మరికొద్ది గంటల్లో చిత్ర ఫలితం తేలిపోతుంది. ప్రస్తుతానికి అయితే యూఎస్ నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే ‘జాను’ను తెరకెక్కించారు కాబట్టి ఎలాంటి మార్పులు లేకుండా రీమేక్ చేశారట. అదే మ్యాజిక్‌ను ప్రేక్షకులకు అందించారట. ఇక శర్వానంద్, సమంత అయితే అద్భుతంగా నటించారని అంటున్నారు. కాకపోతే, సినిమా కాస్త నెమ్మదిగా నడుస్తుందని.. అయినప్పటికీ లవ్‌లోని ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాపై ‘సమయం’ పూర్తి రివ్యూ మరికాసేపట్లో అందిస్తాం. గమనిక: పైన పేర్కొన్న రేటింగ్ సినిమాకు ఉన్న హైప్, ప్రస్తుతం వస్తోన్న పాజిటివ్ టాక్‌ను బట్టి ఇచ్చాం. ‘సమయం’ రివ్యూ వచ్చిన తరవాత రేటింగ్ మారే అవకాశం ఉంది.


from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu ref=da&site=blogger">IFTTT

Post a Comment

0 Comments